తల్లి దీన గాధ..!

– నాలుగేళ్లుగా నరకయాతన
– ట్రాక్టర్ పై నుంచి పడి వెన్నెముక విరిగి -చావు బతుకుల మధ్య కొడుకు
– ఆపన్న హస్తం కొరకు ఎదురు చూపులు
– దాతలు ఆదుకోవాలని తల్లి వినతి
– అన్నీ తానై ఆదు కుంటున్న మాతృమూర్తి
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని బట్టుగూడెం గ్రామానికి చెందిన చెన్ను బిక్షం రెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి గత నాలుగేళ్ల క్రితం వినాయక ఉత్సవాలలో భాగంగా నాగార్జునసాగర్ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ పైనుంచి జారీ కింద పడిపోయాడు. దాంతో ఆయనకు వెన్నెముక విరిగిపోయింది. అప్పటినుంచి ఆయన నరకం అనుభవిస్తున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు పరిస్థితిని సూచి భరించలేని బాధతో మంచం పట్టి మనస్తాపానికి గురై తండ్రి రెండేళ్ళక్రితం చనిపోయాడు. బాధితుడు శ్రీనివాస్ రెడ్డికి వివాహం అయింది. ఒక కొడుకు కూడా వున్నారు. భార్య భర్తకు సేవ చేయలేక అప్పటినుంచి తల్లిగారింటి వద్దనే ఉంటుంది. దాంతో కటుంబ బాధ్యత బాధితుని తల్లి తీసుకుంటు తనకొడుకును సూసుకుంటుంది. తనకు ఉన్న కొద్దీ భూమిని అమ్మి 15 లక్షలు ట్రీట్ మెంట్ కొరకు ఖర్చు చేసింది తల్లి. అయినా కొద్దగా మాత్రమే కోలుకున్నాడు. ఇంకా ట్రీట్ మంటుకు 5, 6, లక్షల వరకు అవసరం ఉంది. డబ్బులు లేక ఆస్పత్రిలో మెతుగైన వైద్యం అందక ఇంటివద్దనే ఉంటూ బాధితునికి వస్తున్న పెన్షన్ తోనే తల్లి తన కొడుకును సూసు కుంటుంది. ఐయినప్పటికి లవలేడు, నడవలేడు, గత కొద్దీ రోజుల నుంచే కొద్దీ కొద్దీ గా మాట్లాడు తున్నాడు. అమాటలు కూడా స్పష్టంగా మాట్లాడలేడు. ఇంకా అతని ఆరోగ్య పరిస్థితి బాగుపడలేదు. ఈ హృదయ విధారకమైన వారి కుటుంబాన్ని సూస్తున్న ప్రతి ఒక్కరు కంట తడి పేడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రకాల పౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్న వారందరు, ఎమ్మెల్యే, ఆదుకొని మెరుగైన చికిత్స కోసం ఆపన్న హస్తం అందించి ఆర్థిక సహాయం చేయాలని తల్లివేడుకుంటుంది.

Spread the love