ముష్టికుంటలో మాయం.. నాగలవంచలో లభ్యం

నవతెలంగాణ-బోనకల్‌
మండల పరిధిలోనే ముష్టికుంట లోనే కంట మహేశ్వర సురాంబ దేవి ఆలయంలో గల హుండీ మాయమై మండల పరిధిలోనే నాగలవంచ ఎన్‌ఎస్పీ కాల్వ సమీపంలోనే -గంగమ్మ గుడి దగ్గర లభ్యమయింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ముష్టికుంట్ల లోనే కంట మహేశ్వరసురాంబ దేవి ఆలయాన్ని మూడేళ్ల క్రితం గౌడ సామాజిక వర్గం నిర్మించింది. ఆ గుడిలోనే హుండీని ఏర్పాటు చేశారు. మే 20వ తేదీన గౌడ సామాజిక వర్గం కంఠమహేశ్వర సురాంబదేవి వివాహం జరిపించారు. ఈ సందర్భంగా భక్తుల కానుకలు పెద్ద సంఖ్యలో వేశారు. ఈ క్రమంలో ఈ నెల 1న అర్ధరాత్రి ఈ ఆలయంలో గల హుండీ మాయమైంది. గుడి వద్దకు వెళ్ళిన వారికి హుండీ లేకపోవడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. దీనికోసం గ్రామస్తులు ప్రధానంగా గౌడ సామాజిక వర్గానికి చెందినవారు మాయమైన హుండీ కోసం ఆ రోజు నుంచి వెతకటం ప్రారంభించారు. ఈ క్రమంలో చింతకాని మండలం నాగలవంచ గ్రామ సమీపంలో గల ఎన్‌ఎస్పీ కాలవ వద్దగల గంగమ్మ గుడి పక్కనే హూండి ప్రత్యక్షమైంది. దీంతో నాగలవంచ గ్రామస్తులు ముష్టికుంట గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్లి చూడగా మాయమైన హుండీ హుండీగా గుర్తించారు. హుండీ తాళం పగలగొట్టి అందులో గల నగదును తీసుకొని హుండీని వదిలేసి వెళ్లారు. సుమారు 20 వేల రూపాయల వరకు ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. తిరిగి దొరికిన హుండీని గుడిలో యధావిధిగా స్థానికులు పెట్టారు.

Spread the love