నా జీవితం ప్రజాసేవకే అంకితం : మంత్రి ఎర్రబెల్లి

నవతెలంగాణ-రాయపర్తి
అనునిత్యం ప్రజలతో ఉంటేనే ఆత్మ సంతప్తి దొ రుకుతుందని.. నా జీవితం ప్రజాసేవకే అంకితమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రా వు అభివర్ణించారు. బుధవారం మండలంలోని ఊకల్‌, గట్టికల్‌, కొండాపురం, జగన్నాథపల్లి, పనీష్‌ తం డా, బాలాజీ తండా, దుబ్బతండాల పరిధిలో బీఆర్‌ ఎస్‌ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఊకల్‌ శివారులో ఏర్పాటు చేయగా మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రజలతో ఫోటోలు దిగారు, తదుపరి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ముచ్చటించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా నావెంటే ఉంటున్న రాయపర్తి మం డల ప్రజలకు రుణపడి ఉన్నా అని వారి కష్టసుఖాల్లో అండగా ఉంటానని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు నా కు కుటుంబసభ్యుడే అని నన్ను నిలదీసి పని చేయిం చుకునే హక్కు ఉందన్నారు. నాకు రాజకీయం ము ఖ్యంకాదని ప్రజల బాగోగులే ముఖ్యమన్నారు. మహి ళలకు పెద్దఅన్నగా, తల్లు లకు కొడుకుగా నన్ను చూ సుకోవడం పూర్వజన్మ సు కృతమన్నారు. నేను సై తం ప్రతిఒక కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటాన ని స్పష్టంచేశారు. ప్రతి ఒ క్కకార్యకర్తను ఎల్లవేళలా కాపాడుకుంటా అని హామీ ఇచ్చారు. బీటీరోడ్డుతో కూ డిన రవాణా సౌకర్యం ఉ న్నప్పుడే గ్రామం అభివృద్ధి చెందిందని అర్థం అన్నారు. గతంలో అంబులెన్సులు గ్రామాలకు వెళ్లాలన్న ఇబ్బంది ఉండేదని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితు లు లేవని తెలిపారు. మండలంలో గ్రామాలను అను సంధానం చేస్తూ పూర్తిస్థాయిలో బీటీ రోడ్లు నిర్మిం చినట్లు వివరించారు. వ్యవసాయసాగునీటికి తిప్ప లుపడేకాలం చెల్లిపోయిందన్నారు. 365 రోజులు ఎ స్సారెస్పీ కెనాల్‌కాల్వల ద్వారా చెరువులోకి నీళ్లు వస్తు న్నాయని చెప్పారు. దాంతో భూముల రేట్లు విపరీ తంగా పెరిగాయని ప్రతిఒక్క రైతన్న ఆనందంగా ఉంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృ ద్ధి ప్రదాత కేసిఆర్‌ పాలన చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉందన్నారు. కేసిఆర్‌ సహకారంతోనే నియో జకవర్గం ప్రగతిపథంలోదూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గాంధీనాయక్‌, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పిటిసి రంగు కుమార్‌, జిల్లా నాయకులు బిల్లా సుధీర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మునావత్‌ నర్సింహనాయక్‌, రై తుబంధు మండల కో-ఆర్డినేటర్‌ ఆకుల సురేందర్‌ రావు, పిఎసిఎస్‌ చైర్మన్‌ రామచంద్రారెడ్డి, సర్పంచ్‌లు హరినాథ్‌, భద్రునాయక్‌, శ్రీలత శ్రీనివాస్‌, వనజనా రాయణ, కోదాటి దయాకర్‌రావు, కమలమ్మ వెంక న్న, ఎంపీటీసీ రాజు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, బీసీ సెల్‌మండల అధ్యక్షుడు చెవ్వుకాశీ, చిన్నాల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.
క్షతగాత్రులకు అండగా మంత్రి ఎర్రబెల్లి
మండలంలోని ఊకల్‌ శివారులో బిఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి మహబూబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణం, అమ్మపురం గ్రామాల నుండి క్యాటరింగ్‌ బార్సుటాటా ఏసీ వాహనంలో సభస్థలికి వెళుతుండగా ఊకల్‌ సమీపంలో వాహనం అదు పుతప్పి పల్టీకొట్టగా ముగ్గురికి తీవ్ర గాయాలు, 20 మందికి స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసు కున్న మంత్రి ఘటన స్థలానికివెళ్లి వారిని హుటాహు టిన తొర్రూర్‌లోని ప్రైవేట్‌ఆసుపత్రిలో చికిత్స అం దించారు. ఆస్పత్రిఖర్చులు పూర్తిగాభరిస్తానని తెలిపా రు. పనినిమిత్తం సభకు వచ్చేవారికి ప్రమాదం జరగ డం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి నేనున్నానని హామీ ఇచ్చారు.

Spread the love