అటవీ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ షాలినికి ఎన్‌ఈఎస్‌ఏ సైంటిస్ట్‌-2023 అవార్డు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ములుగు అటవీ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ షాలినికి నెసా (నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అకాడమీ) సైంటిస్ట్‌ అవార్డు-2023ను అందుకున్నది. సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐ ఆధ్వర్యంలో లక్నోలో జరుగుతున్న జీపీసీసీ కాన్ఫరెన్స్‌-2023లో ఉత్తరప్రదేశ్‌ అర్బన్‌ డైవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ముఖ్య కార్యదర్శి అమ్రిత్‌ అభిజత్‌ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఆ కాన్ఫరెన్స్‌లో ఉత్తమ ప్రజెంటేషన్‌ విభాగంలో కూడా ఆమె ద్వితీయ బహుమతిని పొందారు. ఆమె ములుగు ఎఫ్‌సీఆర్‌ఐ(ఫారెస్ట్‌ కాలేజ్‌ ఆఫ్‌ రీసెర్స్‌ ఇనిస్టిట్యూట్‌) యాజమాన్యం ఆమెకు అభినందనలు తెలిపింది.

Spread the love