నెస్లే ఇండియా ‘బయోడైజెస్టర్‌ ప్రాజెక్ట్ట్‌’

హైదరాబాద్‌ : పాడి రైతులకు మద్దతును ఇవ్వడానికి ‘బయోడైజెస్టర్‌ ప్రాజెక్ట్‌’ను చేపట్టినట్లు నెస్లే ఇండియా తెలిపింది. బయోడైజెస్టర్‌ టెక్నాలజీ పశువుల ఎరు వును క్లీన్‌ బయోగ్యాస్‌గా మార్చడంతో పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతులకు దోహదం చేస్తుందని పేర్కొంది. తొలుత దీన్ని పంజాబ్‌, హరియాణాలోని 24 జిల్లాలలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. బయో డైజె స్టర్‌లలోని అవశేష ఎరువును బయో ఎరువుగా మార్చి పొలాలు, కిచెన్‌ గార్డెన్‌లలో ఉపయోగించేలా ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశామని నెస్లే ఇండియా ప్రతినిధి సంజరు ఖజురియా పేర్కొన్నారు.

Spread the love