- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ వ్యవస్థాపక అధ్యక్షుడు ఐలినేని శ్రీనివాసరావు ఆదేశాలు,ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగపురి శ్రీకాంత్ గౌడ్ సూచన మేరకు మండల అధ్యక్షుడు కారుపాకల ప్రశాంత్, ఉపాధ్యక్షుడు రాళ్లబండి ప్రశాంత్ మంగళవారం కాటారం ఆర్డీఓ రవిందర్ ను మర్యాపూర్వకగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న పలు సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకపోయారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ సూచించారని తెలిపారు.
- Advertisement -



