- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని ఉద్యోగులకు శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ ను రద్దు చేసి ఉద్యోగులకు మేలు చేసే పాత పెన్షన్ పథకం ఓపిఎస్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం భోజన విరామ సమయంలో సిపిఎస్ అంతం మా పంతం అంటూ మండలంలోని వల్లెంకుంట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టి.సుదర్శనం,ఎల్. రమేశ్ నాయక్,ఉపాధ్యాయులు రాజునాయక్,సమ్మయ్య,సత్యనారాయణ,ప్రకాష్,కవిత,శ్రీలత,స్వర్ణ కుమారి,నర్మద పాల్గొన్నారు.
- Advertisement -



