12 మంది సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు

నవతెలంగాణ – హైదరాబాద్‌: సీసీఎస్‌ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. వీరిని మల్టీజోన్ 2కు బదిలీ చేశారు. హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో వీరిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈక్రమంలో సీసీఎస్‌పై వరుస ఆరోపణలతో తాజాగా 12 మందిని బదిలీ చేశారు.

Spread the love