పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
రాహుల్‌గాంధీతో భేటీ
హైదరాబాద్‌లో ఏఐసీసీ ఓబీసీ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తకూ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గ నియామకంతో పాటు, వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు సంబంధించిన నామినేటెడ్ పదవుల భర్తీపై అగ్రనేత రాహుల్ గాంధీతో విస్తృతంగా చర్చించినట్టు చెప్పారు. ఈ నియామకాల ప్రక్రియను వచ్చే నెలలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. గురువారం నాడిక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ పనితీరుతో పాటు కులగణన తదితర కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ దిశలో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఏఐసీసీ ఓబీసీ మీటింగ్ నిర్వహించండి
బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఏ దశలోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. రాబోయే ఏఐసీసీ నేషనల్ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. బీసీల సాధికారత పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని దేశవ్యాప్తంగా చాటేలా ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు అగ్రనేతకు తెలిపారు. అలాగే తెలంగాణ వేదికగా బీసీ ఐక్యతకు మరింత మద్దతు కూడగట్టేందుకు ఈ సమావేశం దోహదపడుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ల కోటాలో కోటా అంశాన్ని జోడించాలని తద్వారా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించాలని రాహుల్‌ని కోరినట్టు తెలిపారు.
శాస్త్రీయంగా కుల గణన బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో చేసిన ఒక్క రోజు సర్వే కాదని మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా కుల గణన చేసిందన్నారు. ఈ సర్వే ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి లోపం జరగలేదన్నారు. అత్యంత శాస్త్రీయ పద్ధతిలో స్పష్టమైన వివరాలు నమోదు చేసినట్టు తెలిపారు. ఎన్యుమరేటర్లు నేరుగా ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి, క్షుణ్ణంగా వివరాలు సేకరించారని గుర్తు చేశారు. ఈ వాస్తవ డేటా ఆధారంగానే భవిష్యత్తులో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందిస్తామన్నారు. తద్వారా సమాజంలో ప్రతి వర్గానికి సామాజిక న్యాయం దక్కాలన్న రాహుల్ గాంధీ ఆశయాన్ని తెలంగాణలో వంద శాతం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
రాహుల్‌తో అనిల్‌కుమార్ భేటీ
అంతకు ముందుకు రాహుల్ గాంధీని రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశమంతటా ‘తెలంగాణ’ నమూనా అమలు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణలో ప్రభుత్వం కుల గణనను అత్యంత విజయవంతంగా, శాస్త్రీయంగా పూర్తి చేసిందన్నారు. రాష్ట్రంలోని సామాజిక నిష్పత్తిని బహిర్గతం చేయడంలో ప్రభుత్వం సఫలమైందని, ఇదే ‘తెలంగాణ మోడల్’ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాహుల్‌ను కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం కేంద్రం చేపడుతున్న జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు మాజీ ఎంపీ వీహెచ్ సైతం రాహుల్‌గాంధీని కలిశారు.
వచ్చే నెలలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



