షూటింగ్లో సల్మాన్ ఖాన్ కి ప్రమాదం..

నవతెలంగాణ – ముంబాయి: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్ లో గాయపడ్డారు. ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం టైగర్ 3. ఈ చిత్ర షూటింగులో పాల్గొంటుండగా సల్మాన్ ఖాన్ ప్రమాదానికి గురయ్యాడట. సల్మాన్ ఖాన్ మీద ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా తన ఎడమ భుజానికి గాయమైందని సల్మాన్ పేర్కొన్నారు. దాంతో వైద్యులు ఆయనకు హుటాహుటిన చికిత్స అందించారు. తన భుజానికైన గాయాన్ని చూపుతూ సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. సల్మాన్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలకు సీక్వెల్ గా తాజా చిత్రం టైగర్ 3 తెరకెక్కుతుంది. సల్మాన్ ఖాన్ కి జంటగా ఈ సినిమాలో కత్రినా కైఫ్ నటిస్తుంది. షారుక్ క్యామియో రోల్ చేస్తున్నారు. మనీష్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా… యష్ రాజ్ ఫిలిమ్స్ సినిమా నిర్మిస్తున్నారు.

Spread the love