ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విత్తనాలను విక్రయించాలి

నవతెలంగాణ – గోవిందరావుపేట
ఖరీఫ్ సీజన్ కు విత్తనాలను విక్రయించే డీలర్లు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా విత్తన విక్రయాలు నిర్వహించాలని మండల వ్యవసాయ అధికారి కే జితేందర్ రెడ్డి మరియు పసరా ఎస్ ఐ సిహెచ్ కరుణాకర్ రావులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ మరియు పోలీసు శాఖ ద్వారా విత్తన డీలర్స్ కి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి కే. జితేందర్ రెడ్డి పసర ఎస్ ఐ సి హెచ్ కరుణాకర్ రావులు డీలర్లకు తగు సలహాలు సూచనలు చేశారు. విత్తన డీలర్స్ తగు స్టాక్ నిల్వ రిజిష్టర్స్ విధిగా అప్డేట్ చేయాలి.లైసెన్స్ ను పొంది ఉన్నా డీలర్స్ మాత్రమే రైతులకు విత్తనాలను అందించాలి.ఇతర ప్రాంతాలనుండి లైసెన్స్ లేని విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే పోలీస్ లకి లేదా ఎంఏఓ కి తెలియజేయాలి. రైతులకు కచ్చితంగా ఇన్వైస్ బిల్స్ డీలర్స్ ఇవ్వాలి, విత్తనాలు వెరైటీ వారీగా ఎం ఆర్ పి ధరలు వారీగా రైతులకు కనిపించే విధంగా స్టాక్ బోర్డ్ పెట్టాలి అని సూచించారు.రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిచి రైతుకు అధిక లాభాలు వచ్చేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఎం ఆర్ పి ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించ కూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ఎస్. గోపాల్ రెడ్డి, డి. దాదా సింగ్ మరియు మండలం లోని విత్తన డీలర్లు పాల్గొన్నారు.

Spread the love