భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండండి..

– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– ముంపు కాలనీల్లో పర్యటించిన మంత్రి సబితా
నవతెలంగాణ – మీర్ పేట్
భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రజలకు సూచించారు. గురువారం మీర్ పేట్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలతో నాళాలు, కాలువలు చాలా వేగంగా పడుతున్నాయని అన్నారు. అందుకే అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. వస్తున్న వర్షపు నీరు నాళాలు, కాలువల్లోంచి సజావుగా వెళ్లేందుకు నాళాల్లో, కాలువల్లో ఉన్న చెత్తను తొందరగా తొగించాలని అధికారులను ఆదేశించారు. చెరువు దిగువ ప్రాంతాల్లో ఉన్న కాలనీవాసులను అప్రమత్తంగా ఉంచాలని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ప్రజలకు ఎక్కడ సమస్యలు రాకుండా సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్లపై నీరు నిల్వకుండా అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పనిచేయాలని చెప్పారు. చందన చెరువు ఎదురుగా ఆర్సిఐ రోడ్డు పైన చేరినటువంటి వర్షపు నీరు సజావుగా వెళ్ళేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించారు. ఈ పర్యటనలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కమీషనర్ ఎ.వాణి రెడ్డి, డిఈ గోపీనాథ్, ఎఈ శ్రీనివాస్, కార్పొరేటర్లు, బిఆర్ఎస్ నాయకులు, వివిధ కాలనీల ప్రజలు ఉన్నారు.
Spread the love