ఓటరు జాబితా పై రాజకీయ సమావేశం

Political meeting on voter listనవతెలంగాణ – నసురుల్లాబాద్
గ్రామీణ ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఇంచార్జ్ ఎంపీడీవో సూర్యకాంత్ తెలిపారు. గురువారం నసురుల్లాబాద్ మండల సమీకృత సముదాయ భవనంలో భవనంలో ఏర్పాటు చేసిన అన్ని పార్టీల నాయకులతో గ్రామపంచాయతీ వార్డ్ సభ్యుల ఓటర్ లిస్ట్ తయారీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ఎంపీడీవో మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు  గ్రామాల్లో ఉన్న అన్ని పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శించడం జరిగిందన్నారు. నూతన ఓటర్ నమోదు దరఖాస్తులను సెప్టెంబర్ 21 లోపు ఇవ్వలన్నారు. సెప్టెంబర్ 26 లోపు అభ్యంతరాలను పరిష్కరించి, సెప్టెంబర్ 28న తుది ఓటర్ జాబితా విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో  మండలంలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love