ఆచరణ

ఆచరణబాల్యంలో ఆహార వ్యవహారాలకు సంబందించిన అనేక విషయాలను కుటుంబం నుండి నేర్చుకుంటాం. నిత్యజీవితంలో వాటిని ఆచరిస్తూ అలవాటుగా మార్చుకుంటాం. అదే విధంగా పెరుగుతున్న వయసుకు తగ్గట్టుగా విద్యా, వృత్తి, సామాజిక పరమైన అంశాలను కూడా నేర్చుకుని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఎందుకంటే చదువుల్లో, ఉద్యోగాల్లో చివరి నిమిషయంలో ప్రయత్నిస్తే చేదు ఫలితాలను చవి చూడాల్సి వస్తుంది. అందుకే ఏ మంచినైనా ప్రణాళికా బద్ధంగా నిత్యాచరణలో అలవాటుగా మార్చగలగాలి. ఉదాహరణకు సామాజిక జ్ఞానం ఒక్క రోజులో అవపోసన పట్టలేం. అందుకే ప్రతిరోజు కచ్చితంగా కొంత సమయాన్ని దినపత్రికలు, పుస్తకాలు చదవటానికి కేటాయించాలి.
బాల్యం నుండే మనం అనేక విషయాలను నేర్చుకుంటూ వుంటాం. కానీ చాలా వాటిని ఆచరణలో పెట్టం. ఫలితంగా జీవితంలో ఎదగవలసిన స్థాయికి ఎదగ లేక చతికిల పడిపోతూ ఉంటాం. ఆ విషయాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ, అయిష్టం, ఏకాగ్రత లోపించటమే దీనికి ప్రధాన కారణాలు. జీవితానికి అవసరమైన విషయాలను సరియైన సమయంలో నేర్చుకోలేక, నేర్చుకున్నా బలంగా మనసులో నిక్షిప్తం చేసుకోక చాలామంది వచ్చిన అవకాశాలు అందుకోలేకపోతారు. ఫలితంగా మానసిక వేదన అనుభవిస్తుంటారు. ఇటువంటి సందర్భాలలోనే పెద్దలంటారు మంచిని అంటించుకొని చెడును వదిలించుకోవాలని.
ముఖ్యంగా నేటి విద్యా విధానాలలో మంచి విషయాలను నేర్చుకోవడమే పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఆచరణ ఎలా సాధ్యం? ఏదో యాంత్రికంగా నాలుగు మార్కుల కోసమన్నట్టుగా చదువుతూ పొందవలసిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. దీనివల్ల తమ కాళ్ళ మీద తాము నిలబడాల్సిన రోజున అనేక ఇబ్బందులకు గురి అవుతుంటారు. ఎందుకంటే ఎదగవలసిన స్థాయిలో ఎదగలేక, అవకాశాలు అందుకోలేక నేటి యువత పెడధోరణులకు అలవాటు పడుతుంది. సామాజిక పరిణామాలకు తగ్గట్టుగా జీవన విధానాలలో మార్పులు చేర్పులు సహజమే. కానీ అవి నేర్చుకోవాల్సిన విషయాల ఆచరణలకు, వాటి అమలుకు అడ్డుగోడలుగా ఉండరాదు. ఎందుకంటే భవిష్యత్‌లో ఎన్నెన్నో విషయాలను నేర్చుకొని జీవిత లక్ష్యాలను సాధించటానికి అవి అవరోధంగా మారతాయి.
బాల్యంలో ఆహార వ్యవహారాలకు సంబందించిన అనేక విషయాలను కుటుంబం నుండి నేర్చుకుంటాం. నిత్యజీవితంలో వాటిని ఆచరిస్తూ అలవాటుగా మార్చుకుంటాం. అదే విధంగా పెరుగుతున్న వయసుకు తగ్గట్టుగా విద్యా, వృత్తి, సామాజిక పరమైన అంశాలను కూడా నేర్చుకుని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఎందుకంటే చదువుల్లో, ఉద్యోగాల్లో చివరి నిమిషయంలో ప్రయత్నిస్తే చేదు ఫలితాలను చవి చూడాల్సి వస్తుంది. అందుకే ఏ మంచినైనా ప్రణాళికా బద్ధంగా నిత్యాచరణలో అలవాటుగా మార్చగలగాలి. ఉదాహరణకు సామాజిక జ్ఞానం ఒక్క రోజులో అవపోసన పట్టలేం. అందుకే ప్రతిరోజు కచ్చితంగా కొంత సమయాన్ని దినపత్రికలు, పుస్తకాలు చదవటానికి కేటాయించాలి. దీనివలన భవిష్యత్లో మనం ఎదుర్కోబోయే ఎన్నెన్నో సమస్యలకు దీటైన సమాధానాలు దొరకుతాయి. మనలో హేతుబద్దమైన ఆలోచనా విధానానికి, ఆత్మవిశ్వాసాలకు ఆలంబనగా నిలుస్తాయి.
ఆచరణే జీవితంలో మనం సాధించాల్సిన విజయాలకు చక్కని ప్రణాళిక. అలాంటి ఆచరణను అలవాటుగా చేసుకుంటే మనం ఊహించిన దానికంటే ఉన్నత శిఖరాలకు మనల్ని చేరుస్తుంది. క్రమశిక్షణతో కూడిన ఆచరణే పునాదిగా నిలిచి మరెన్నో విజయాలకు తార్కాణంగా నిలుస్తుంది. సామర్ధ్యాలు, నైపుణ్యాలు ఏవైనా ఒక్క రోజులో నేర్చుకునేవి కావు. మనం ఏ రంగాలలో పనిచేస్తున్నా ఎప్పటికప్పుడు మన మేధస్సుకు పదును పెట్టుకోవటానికి నిత్యాచారణ అనేది మన సంకల్ప బలంగా ఉండాలి.
ఆచరణ అనేది ప్రణాళికా బద్దంగా కొనసాగాలి కానీ మొక్కుబడి ప్రయత్నంగా ఉండరాదు. ప్రతి ప్రయత్నంలో ఆచరణ అనేది ఏకాగ్రతతో, అకుంఠిత దీక్షతో కొనసాగాలి. ఆచరణలో అనవసర మార్పు చేర్పులు, కాలయాపనలు లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా జీవితంలో ఏ విజయాన్ని సొంతం చేసుకోవాలన్నా వీడని ప్రయత్నంగా, ఆచరణే ఆలంబనగా కొనసాగితే వేసే ప్రతి అడుగు విజయం దిశగా పడుతుందనటంలో సందేహమే లేదు.

Spread the love