Thursday, August 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమోకిల లేఅవుట్ ప్లాట్ల ఈ-వేలానికి కసరత్తు

మోకిల లేఅవుట్ ప్లాట్ల ఈ-వేలానికి కసరత్తు

- Advertisement -

హెచ్‌ఎండీఏ ‘ప్రీ-బిడ్’ సమావేశం విజయవంతం
భారీగా బిడ్డర్లు.. సందేహాలు నివృత్తి చేసిన ఉన్నతాధికారులు
ఆగస్టు 31 వరకు రిజిస్ట్రేషన్ల గడువు
సెప్టెంబర్ 2న ఈ-వేలం నిర్వహణ
నవతెలంగాణ-సిటీబ్యూరో

​ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మోకిల లేఅవుట్‌లోని 35 నివాస ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధమైంది. ఈ-వేలం ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు బుధవారం మోకిలలో ఔత్సాహిక కొనుగోలుదారులతో ‘ప్రీ-బిడ్ సమావేశం’ నిర్వహించారు. ఆన్‌లైన్ బిడ్డింగ్ ప్రక్రియ, లేఅవుట్ ప్రత్యేకతలు, నిబంధనలపై బిడ్డర్లకు పూర్తి స్పష్టతనిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, రియల్టీ ప్రతినిధులు హాజరయ్యారు.

​అధికారుల సమక్షంలో సందేహాల నివృత్తి
ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్, ప్లానింగ్, ఎస్టేట్స్ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొని బిడ్డర్లతో ముఖాముఖి మాట్లాడారు. లేఅవుట్ అభివృద్ధి, తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు, నివాస ప్లాట్ల కొలతలు, ఈ-వేలం నిబంధనలపై వారు అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు సమగ్ర సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ సూపరింటెండింగ్ ఇంజినీర్ (డివిజన్-5) వి.వి.వి.ఎస్. అప్పారావు, డిప్యూటీ కలెక్టర్ (ఎస్టేట్స్) వై.సుదర్శన్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఎ.రవీందర్ రెడ్డి, పీఆర్వో కె.శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ డి. శ్రీకాంత్ రెడ్డి, ఈ-వేలం నిర్వహణ సంస్థ ఎంఎస్‌టీసీ, ట్రాన్స్‌క్షన్ అడ్వైజరీ సంస్థ కేపీఎమ్‌జీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ-వేలం నిర్వహణను పర్యవేక్షిస్తున్న ఎంఎస్‌టీసీ ప్రతినిధులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం, అర్హత ప్రమాణాలు, ఈఎండీ చెల్లింపులు, బిడ్ల సమర్పణ తదితర సాంకేతిక అంశాలను స్క్రీన్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దీనివల్ల బిడ్డర్లకు వేలంలో ఎలా పాల్గొనాలనే దానిపై పూర్తి స్పష్టత లభించింది.

​‘మోకిల లేఅవుట్’ పెట్టుబడికి సువర్ణావకాశం
హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న పశ్చిమ కారిడార్‌ (గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట)కు అత్యంత సమీపంలో మోకిల ఉండటం దీని ప్రధాన బలమని అధికారులు వివరించారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రణాళికాబద్ధమైన లేఅవుట్, అత్యుత్తమ రోడ్డు కనెక్టివిటీ ఉండటంతో ఇక్కడ స్థలాలు సొంతం చేసుకోవడం భవిష్యత్‌కు గొప్ప భరోసా అని తెలిపారు. ఈ సువర్ణావకాశాన్ని ఆసక్తిగల బిడ్డర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ ఈనెల 31 కాగా, వచ్చేనెల 2వ తేదీన ఈ-వేలం నిర్వహణ ఉంటుంది. సందేహాల నివృత్తి కోసం హెచ్‌ఎండీఏ టోల్ ఫ్రీ నంబర్‌ 7416835522ను సంప్రదించొచ్చని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -