ఫైటర్‌ జెట్లలో మహిళలకు ప్రాధాన్యత : రాష్ట్రపతి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఫైటర్‌జెట్‌ పైలట్లలో మహిళలు ఎక్కువమంది ఉండటం సంతోషంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దుండిగల్‌లో ని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు రివ్యూయింగ్‌ ఆఫీసర్‌గా ఆమె హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించి, మాట్లాడారు. క్యాడెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పిం చిన వారి సేవలను గుర్తుంచుకో వాలని చెప్పారు. టర్కీ భూకంప సహాయక చర్యల్లో వాయుసేన బాగా పనిచేసిందనీ, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. దేశ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా గతంలో సుఖోరు జెట్‌లో తన ప్రయాఫైటర్‌ జెట్లలో మహిళలకు ప్రాధాన్యత : రాష్ట్రపతిణ అనుభూతిని ఆమె క్యాడెట్లతో పంచుకున్నారు. ఈ తరహా పరేడ్‌కు రివ్యూయింగ్‌ అధికారిగా రాష్ట్రపతి వ్యవహరించడం ఇదే తొలిసారి అని ఎయిర్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజన్‌కుమార్‌ పాల్గొన్నారు. మొత్తం 119 ఫ్లయింగ్‌ ఎయిర్‌ ట్రైనీ, 75 మంది గ్రౌండ్‌ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు దుండిగల్‌లో శిక్షణ పూర్తిచేసుకున్నారు. వీరితో పాటు ఇద్దరు వియత్నాం క్యాడెట్లు, ఆరుగురు నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన క్యాడెట్లు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

Spread the love