మొటిమలు రాకుండా…

Acne free...ఏదొక సందర్భంలో మొహంపై మొటిమలు గమనిస్తూనే ఉంటాం. అవి సర్వసాధారణం. అయితే వస్తూనే ఉంటాయిలే అని వాటిని అలాగే వదిలేస్తే చర్మం పాడైపోతుంది. అందుకే వాటిని నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తేసరి…

 వెల్లుల్లిలో ఎన్నో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలున్నాయి. అందుకే ఇది మొటిమలను తగ్గించేందుకు చక్కగా తోడ్పడుతుంది. మొటిమలపై చిన్న వెల్లుల్లి ముక్కతో రుద్దండి. ఇలా చేస్తే చాలా తొందరగా తగ్గుతాయి.
యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ యాంటీ సెప్టిక్‌, యాంటీ ఫంగల్‌ గుణాలను కలిగి ఉంటుంది. వివిధ చర్మ సమస్యలను దూరం చేసేందుకు దీన్ని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మొటిమలు తగ్గించేందుకు కొద్దిగా దూదిని తీసుకొని దాన్ని ఈ వెనిగర్‌లో ముంచి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయడం వల్ల అవి తగ్గుముఖం పడతాయి.
తేనెలో కూడా యాంటీసెప్టిక్‌ గుణాలుంటాయి. ఇది మొటిమలను తగ్గించి చర్మానికి తేమను అందిస్తుంది. దాల్చిన చెక్క కూడా మొటిమలను తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఈ రెండింటినీ కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రుద్దడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి.
మౌత్‌వాష్‌ నోటిని చక్కగా శుభ్రం చేసి బ్యాక్టీరియాను దూరంగా ఉంచడమే కాదు.. మొటిమలను తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. రాత్రి సమయంలో ఒక చుక్క మౌత్‌ వాష్‌ని మొటిమలపై వేసి కాస్త రుద్ది పడుకోండి. ఉదయానికి అది పూర్తిగా తగ్గిపోతుంది.
టూత్‌పేస్ట్‌కు కూడా మొటిమలను తగ్గించగలిగే లక్షణం వుంది. రోజులో కనీసం రెండుమూడుసార్లు దీన్ని మొటిమలపై రాసి చూడండి.

Spread the love