చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

నవతెలంగాణ – ఢిల్లీ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబుకు విషెస్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అంకితభావంతో కృషి చేసే అనుభవజ్ఞుడైన నాయకుడు. ప్రజాసేవలో నిమగ్నమైన ఆయన దీర్ఘాయుష్కుడై, ఆరోగ్యవంతుడై జీవించాలని ప్రార్థిస్తున్నాను” అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Spread the love