రేపటి నుంచి అమెరికాలో రాహుల్‌ పర్యటన..

నవతెలంగాణ – న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సోమవారం నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల గడువుతో కూడిన ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ ఆయనకు మంజూరైంది. దీనికి సంబంధించిన నిరభ్యంతర సర్టిఫికేట్‌ను ఢిల్లీ కోర్టు శుక్రవారం ఇచ్చింది. దీంతో పదేళ్ల గడువుతో కూడిన ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ బదులుగా మూడేళ్ల కాలానికి పని చేసే తాత్కాలిక ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ను రాహుల్‌ గాంధీకి ఇచ్చారు. రాహుల్‌ గాంధీ సోమవారం నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగనున్న సమావేశాలకు ఆయన హాజరవుతారు. ఆయా నగరాల్లోని యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడతారు. భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అమెరికా చట్టసభ సభ్యులను కలుస్తారు. థింక్ ట్యాంక్ సభ్యులు, వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్‌లు, యూనివర్సిటీ విద్యార్థులతో కూడా ఆయన చర్చలు జరుపుతారు.

Spread the love