దక్షిణ, తూర్పు తెలంగాణకు వర్ష సూచన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాముంది. హైదరా బాద్‌, రంగారెడ్డి, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉంది. వరుసగా వారం నుంచి కొడుతున్న మండు టెండలు కాస్త తగ్గాయి. అయితే, వేడిగాలి మాత్రం అలాగే వీచింది.

Spread the love