దామరచర్ల ఏ45.2 డిగ్రీలు

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
దామరచర్ల(నల్లగొండ) 45.2 డిగ్రీలు

రామగుండం(పెద్దపల్లి) 45.1 డిగ్రీలు
మహదేవపూర్‌(జయశంకర్‌ భూపాలపల్లి) 45.1 డిగ్రీలు
రంగంపల్లి(పెద్దపల్లి) 45.1 డిగ్రీలు
నేలకొండపల్లి(ఖమ్మం) 45.0 డిగ్రీలు
మార్తాన్‌పేట(రాజన్నసిరిసిల్ల) 44.9 డిగ్రీలు
తంగుల(కరీంనగర్‌) 44.8 డిగ్రీలు
చాప్రాల(ఆదిలాబాద్‌) 44.8 డిగ్రీలు
మల్లాపూర్‌(జగిత్యాల) 44.7 డిగ్రీలు
– రెడ్‌ అలర్ట్‌ జోన్‌లో నాలుగు జిల్లాలు
– తన ప్రతాపాన్ని చూపుతున్న భానుడు
– కొన్ని ప్రాంతాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే భానుడు తన విశ్వరూపాన్ని చూపుతున్నాడు. అదే సమయంలో తీవ్ర ఉక్కపోత తీవ్రంగా ఉంటున్నది. నల్లగొండ జిల్లా దామరచర్లలో 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రెడ్‌ అలర్ట్‌ జోన్‌లో ఐదు జిల్లాలున్నాయి. అందులో నల్లగొండ, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు బుధవారం 45 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. బుధవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 25 ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సూచించింది. అక్కడక్కడా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా పడొచ్చని సూచించింది. ముఖ్యంగా నల్లగొండ, మంచిర్యాల జిల్లాలో వడగండ్ల వాన పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

Spread the love