కూలీగా రజనీకాంత్‌

కూలీగా రజనీకాంత్‌ఎప్పటికప్పుడు సరికొత్త కథలు, పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్టయిల్‌ని క్రియేట్‌ చేసుకున్న రజనీకాంత్‌ అతి త్వరలో ‘కూలీ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రజనీకాంత్‌, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది రజనీకాంత్‌ నటిస్తున్న 171వ చిత్రం. సోమవారం ఈచిత్ర టైటిల్‌తోపాటు రజనీకాంత్‌ ఫస్ట్‌లుక్‌ని సైతం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో రజనీ ఎప్పట ిమాదిరిగానే తనదైన స్టయిల్‌లో సరికొత్త లుక్‌తో కూలీగా కనిపిస్తూ అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ తదితర చిత్రాలతో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న లోకేష్‌ కనకరాజ్‌ ఈ సినిమా గురించి మాట్లాడుతూ,’ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ఇందులో రజనీకాంత్‌ పాత్ర చాలా చాలా విభిన్నంగా ఉంటుంది. అలాగే కొంచెం నెగటీవ్‌ షేడ్స్‌లో ఉన్న రోల్‌లో ఆయన కనిపించే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయి యాక్షన్‌ఎంటర్‌టైనర్‌. రజనీ మరోమారు ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకుల్ని అలరించనున్నారు’ అని అన్నారు.

Spread the love