ఆర్‌అండ్‌బీలో ఐటీ ప్రొఫెషనళ్ల నియామకాలు

నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియామకాలు జరగనున్నాయి. ఈమేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రం పరిధిలోని జాతీయ రహదారుల నిర్మాణ అవసరాల కోసం ఐటీ ప్రొఫెష నళ్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈమేరకు ఆర్‌అండ్‌బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఐ.గణపత్తిరెడ్డి పర్యవేక్షణలో శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పది మంది దరఖాస్తు చేయగా, ఎనిమిది మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజర య్యారు. ఐటీలో అభ్యర్థులకున్న అనుభవం ఆధారంగా నియామకం చేయను న్నారు. అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన జరిగే నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30 వేల చొప్పున వేతనం చెల్లించనున్నారు.
ఈఏన్సీ ఆధ్వర్యంలో ఉన్న ప్రత్యేక కమిటీ వీరి నియామకాలను ఖరారు చేస్తుంది.

Spread the love