ఉద్యోగులకు పదవీ విరమణలు సహజమే

– విద్యాశాఖ జిల్లా అధికారి సుశీందర్‌రావు
నవతెలంగాణ-శంకర్‌పల్లి
ఉద్యోగులకు పదవీ విరమణలు సహజమేనని విద్యాశాఖ జిల్లా అధికారి సుశీందర్‌రావు అన్నారు. మంగళవారం శంకర్‌పల్లి మండలంలోని రేసు సత్తిరెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మహరాజ్‌ పేట్‌ ప్రధానోపాధ్యాయులు సురేందర్‌రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై, మాట్లాడుతూ ఉపాధ్యాయులు 33 ఏండ్లు సేవలు చేసిన అనంతరం ఉద్యోగ పదవీ విరమణ పొందడం సహజమేనని అన్నారు. వారి భావి జీవితం ఆయు, ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మండల విద్యాధికారి సయ్యద్‌ అక్బర్‌ మాట్లాడుతూ సురేందర్‌ రెడ్డి పాఠశాలకు, మండలానికి చేసిన సేవలను అభినందించారు. జిల్లా పరిషత్‌ ఎంపీపీ ఎస్‌ ప్రధానోపాధ్యాయులు బాలరాజ్‌, ఎండి.వీణ, తాహెర్‌ అలీ, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్‌ పర్వేద ప్రధానో పాధ్యాయులు డి.సిద్ధేశ్వర్‌, ఉపాధ్యాయ బృందం సురేందర్‌ రెడ్డినీ ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీయూటీఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డి. మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రఘు నందన్‌రెడ్డి, టీటీసీ రాష్ట్ర అధ్యక్షులు పి. ఆశీర్వాదం మాట్లాడుతూ ఉద్యోగ విరమణ ఉద్యోగి జీవితంలో సర్వసాధారమని, 39 ఏండ్ల సుదీర్ఘ ఉపా ధ్యాయ వృత్తిలో ఎంతో మంది పేద విద్యార్థుల ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేశా రని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌జీమెచ్‌పే బాధ్యులు గిరిధర్‌, కృష్ణయ్య, వెంకటయ్య, జయసింహరెడ్డి, పీర్టీయూటీఎస్‌ బాధ్యులు గోవర్థన్‌యాదవ్‌, మహేందర్‌రెడ్డి, టీయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు డేవిడ్‌, టీఆర్టీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు అశోక్‌, శంకర్‌పల్లి పీర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్‌, రాములు, టీయూటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుదర్శన్‌, శ్రీనివాస్‌ చారి, ఎస్‌టీయూటీఎస్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, టీపీయూఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, శ్రీను, యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, టీఎస్‌ సీపీఎస్‌ఈఎస్‌యూ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌, జడ్పీహెచ్‌ఎస్‌పీఎస్‌ మహరాజ్‌ పేట్‌ ఉపాధ్యాయులు సరిత, సంగీత, పుష్పాలత, రాజేందర్‌ రెడ్డి, అశోక్‌, సుమతి లత, జడ్పీహెచ్‌ఎస్‌ పర్వేద పాఠశాల ఉపాధ్యాయులు, శ్రీధర్‌ రెడ్డి, రాజు, రాజేందర్‌, కవిత, కాంచన లక్షిమీ, పల్లవి, ధనలక్ష్మి, మండలంలోని వివిధ పాఠశాలల, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love