రైతు నేస్తం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

– జిల్లా వ్యవసాయాధికారి గీత
నవతెలంగాణ-మొయినాబాద్‌
రైతుల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని వినియోగించు కోవాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి గీత తెలిపారు. మొయినాబాద్‌ మండల కేంద్రంలో ఉన్న రైతు వేదిక వద్ద వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా నిర్వ హించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ఆమె మంగళ వారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ మంగళవారం శాస్త్రవేత్తలతో నిర్వహించే ఈ రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా పంటలపై వచ్చే చీడ పీడల నివారణకు అనుసరించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకోవాలని రైతులకు సూచించారు. రైతులు తమకే కేటాయించిన వరి కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని తెలిపారు. వడ్లలో తేమ శాతం 17 శాతం కంటే తక్కవగా ఉండే విధంగా చూసు కోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వరిలో నేరుగా విత్తే పద్ధతుల గురించి, మామిడిలో సస్య రక్షణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి, వ్యవసాయ విస్తరణా ధికారి కుమార్‌, సునీల్‌, రైతులు పాల్గొన్నారు.

Spread the love