స్పీకర్ ఫార్మాట్ లో లేని రాజీనామా లేఖ చెల్లదు.. హరీష్ రావుకు రేవంత్ రెడ్డి కౌంటర్…

నవతెలంగాణ హైదరాబాద్: స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే ఆ రాజీనామా లేఖ చెల్లదని మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తదన్నారు. హారీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం అన్నారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజీనామా లేఖ అలా ఉండదన్న సీఎం… హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని విమర్శించారు. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందని అన్నారు. హరీష్.. ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్ ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నామన్నారు. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. నీ రాజీనామా రెడీగా పెట్టుకోవాలని సవాల్ విసిరారు.

Spread the love