రేపు మహబూబ్ నగర్ లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం

నవతెలంగాణ – హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేడు మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. జిల్లాలోని జడ్చర్ల, అప్పనపల్లి, ఏనుగొండ మీదుగా గడియారం కూడలికి చేరుకుంటారు. గడియారం కూడలికి చేరుకొని కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. కాగా, కేసీఆర్‌ రైతుల కోసం, రాష్ట్రం కోసం 17రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, 12లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతారు. లోకసభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తారు.

Spread the love