రేపు పిఠాపురంలో పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం

నవతెలంగాణ – అమరావతి : జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కోసం పిఠాపురంలో ఇప్పటికే నాగబాబు, జానీ మాస్టర్, హైపర్ ఆది, పృథ్వీ, గెటప్ శ్రీను తదితరులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రేపు (ఏప్రిల్ 27) పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారానికి రానున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరుణ్ తేజ్ బాబాయ్ కోసం ప్రచారం చేపట్టనున్నారు. వరుణ్ తేజ్ రోడ్ షోలో కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

Spread the love