మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాల్‌కు ఆర్టీసీ అధికారుల నోటీసులు

నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డికి చెందిన మాల్‌కు సంబంధించి నోటీసులు జారీ చేశారు. రూ.8 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని ఈ మాల్ ఎదుట మైక్‌లో ప్రకటించారు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాల్‌ను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ మాల్‌కు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. విద్యుత్ శాఖకు రూ.2 కోట్ల బకాయి ఉండటంతో గతంలోనే నోటీసులు ఇచ్చారు. బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడంతో విద్యుత్ నిలిపివేసినట్లు వెల్లడించారు.

Spread the love