బేతవోలు రామబ్రహ్మంకు సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ అవార్డు

న్యూఢిల్లీ :పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామానికి చెందిన ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మంకు సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ అవార్డు వరించింది. ఇటీవల న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్‌లో అకాడమీ అధ్యక్షులు మాధవ్‌ కౌశిక్‌ అధ్యక్షతన సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంప్రదాయ, మధ్యయుగ సాహిత్యంలో ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం చేసిన అమూల్యమైన కృషికి గుర్తింపుగానూ ఆయనకు భాషా సమ్మాన్‌ను ఆమోదించారు. భాషా సమ్మాన్‌ నగదు బహుమతిగా రూ.లక్ష నగదు, రాగి ఫలకం, ప్రశంసా పత్రం అందజేయనున్నారు. దీనికి జ్యూరీ సభ్యులుగా ప్రొఫెసర్‌ కెఎస్‌ రవికుమార్‌, ప్రొఫెసర్‌ వీరేష్‌ బడిగేర్‌, డాక్టర్‌ ముక్తేవి భారతి వ్యవహరించారు.

Spread the love