ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎస్‌బీఐ ఎండీ జానకిరామన్‌

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూ టీ గవర్నర్‌గా ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్వామి నాథన్‌ జానకిరామన్‌ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మహేశ్‌ కుమార్‌ జైన్‌ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. దీంతో ఆ స్థానంలో జానకిరామన్‌ను నియ మించారు. ప్రస్తుతం ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ ఉండగా.. డిప్యూటీ డైరెక్టర్లుగా మైఖెల్‌ పాత్ర, ఎం రాజేశ్వరరావు, టి రవిశంకర్‌ ఉన్నారు.

Spread the love