హనుమాన్‌ జయంతికి భద్రత కట్టుదిట్టం

– పలు ప్రాంతాలల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హన్‌మాన్‌ జయంతీ సందర్భంగా పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. హను మాన్‌ జయంతీ సందర్భంగా విజయయాత్ర (ర్యాలీ) నిర్వ హించనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాలల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. మం గళవారం ఉదయం 11:30గంటలకు గచ్చిబౌలీలోని రాంమందిర్‌ నుంచి కోఠీ, సుల్తాన్‌బజార్‌, కాచిగూడా ఎక్స్‌రోడ్‌, ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌ మీదుగా అశోక్‌నగర్‌, గాంధీనగర్‌, కవాడీగూడా, బన్సిలాల్‌పేట్‌, పారడైజ్‌ నుంచి సికింద్రాబాద్‌, తాడ్‌బంన్‌ వరకు దాదాపు 12కిలోమీటర్ల మేర విజయయాత్ర కొనసాగనుంది. ఇదిలావుండగా కర్మన్‌ఘాట్‌ (రాచకొండ పోలీస్‌కమిషనరేట్‌ పరిధిలోని) నుంచి మరో ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ చంపాపేట్‌, ఐఎస్‌ సదన్‌, సైదాబాద్‌ వై జంక్షన్‌ మీదుగా సరూర్‌నగర్‌ ట్యాంక్‌ మీదుగా దిల్‌శుక్‌నగర్‌ ఇలా తిరిగి సిటీ పరిధిలోకి చేరుతుంది. మూసారాంబాగ్‌ జంక్షన్‌, మలక్‌పేట్‌, ఛాదర్‌ ఘాట్‌ ఎక్స్‌రోడ్‌ నుంచి మేయిన్‌ ర్యాలీలో కలుస్తుంది. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పోలీస్‌ అదికారులు అన్ని చర్యలు చేపట్టారు. సుల్తాన్‌బజార్‌, గౌలీగూడా చెమాన్‌, జీపీఓ, కాచిగూడా, నారాయణగూడా, చిక్కడ్‌పల్లి, సికింద్రాబాద్‌, బేగంపేట్‌, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాలల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టారు.
మద్యం దుకాణాల మూసివేత
మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం దుకాణాలను ఓపెన్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హనుమాన్‌ జయంతిని ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని సీపీ కోరారు. ఎలాంటి వదంతులను సృష్టిం చొద్దని, వదంతులను సృష్టించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Spread the love