Friday, June 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతాంగానికి విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలి

రైతాంగానికి విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలి

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి అవసరమైన అన్ని రకాల విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దుచేసి కొత్తగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు. ఈ  సందర్భంగా అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు యు.రాజన్న, జిల్లా కార్యదర్శి కిషన్ లు మాట్లాడుతూ రైతాంగానికి వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు సగం సబ్సిడీ పై ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, కనీస మద్దతు ధరలు నిర్ణయించి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కల్తీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలని అన్నారు.

కల్తీ విత్తన వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అకాల వర్షాల వలన నష్టపోయిన అరటి, మామిడి ఇతర పంటలకు  ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, మోడీ పాలన గొప్పలు చెప్పుకుంటుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల మరియు గ్రామీణ సంపన్న వర్గాల అనుకూల విధానాలన్నిటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు. దీనివలన  స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ప్రకారం మన రైతాంగానికి తమ పంటలకు కనీస మద్దతు ధర(MSP) లభించడం లేదని వ్యవసాయ ఉత్పాదకాల (ఇన్ ఫుడ్స్) ధరలు నిరంతరం పెరుగుతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రజలుకు భూమి లేని వారికి భూమి,ఇల్లు లేని వారికి ఇల్లు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వాలని, డిమాండ్ చేశారు.

వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, చిన్న సన్నకారు మరియు మధ్య తరగతి రైతులందరికీ పూర్తి రుణమాఫీ చేయాలని, కొత్తగా వడ్డీ లేని రుణాలు అందించాలని, రైతాంగ పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం మద్దతు ధరలు ఇవ్వాలని, మోడీ పాలన ఇండో అమెరికన్ వాణిజ్య ఒప్పందం ద్వారా మరియు మన వ్యవసాయాన్ని విదేశీ స్వదేశీ కార్పొరేట్లకు ద్వారాలు తెరవడం ద్వారా దేశ ప్రయోజనాలను, రైతు ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధానాలను వెంటనే నిలిపి వేయాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐయుకేఎస్ ఆర్మూర్ ఏరియా ఉపాధ్యక్షుడు ఈ. రమేష్, నాయకులు ఏ.బద్రి, ఎం. సాయన్న, ఎన్. నాగన్న, ఏ. సాయన్న, సిహెచ్. మల్లేష్, మంగలి గంగారం, సాయన్న, పోషన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -