Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్   నూతన కార్యదర్శికి ఘన సన్మానం

   నూతన కార్యదర్శికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
ఆలూర్ మండలంలోని కల్లడి గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ను గ్రామ సర్పంచ్ గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యదర్శి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. నూతన కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, సిబ్బంది సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు దూదిగాం గంగాధర్, రొడ్డ వంశీకృష్ణ, మచ్చ సురేష్ గౌడ్, కారోబార్లు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -