యునిఫాంల బాధ్యత స్వయం సహాయక సంఘాలదేనా.?

– పున:ప్రారంభం నాటికి దుస్తులు సిద్ధం అయ్యేనా.?
– విద్యార్థుల వివరాలను సేకరించిన మహిళ ఐక్య సంఘాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిపామ్ లను అందించే బాధ్యతను ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది.పాఠశాలలు ప్రారంభం అయ్యే వరకు విద్యార్థులకు ఏకారుప దుస్తులు అందించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిపామ్ లు అందించాలనే ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే పాఠశాలలు పున.ప్రారంభం నాటికి స్వయం సహాయక సంఘాల దుస్తులను సకాలంలో అందించేనా అనే సందేహాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఆదేశాలు జారీ..
మండలంలోని 15 గ్రామపంచాయితీల పరిధిలోని 5 జిల్లా పరిషత్,రెండు ప్రాథమికోన్నత,26 ప్రాథమిక, ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల,ఒక మోడల్ పాఠశాల,మొత్తం 36 పాఠశాలల్లో 1848 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. వారికి జూన్ 12 పాఠశాలలు పునప్రారంభం అవుతాయి. పాటశాలలు ప్రారంభంలోనే ఏకారుప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థులకు చదువులకు ఆటంకాలు కలుగకుండా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఈనెల 24 లోపే మహిళ సంఘాలు పాటశాలను సందర్షించి వివరాలను నమోదు చేసుకోవాలని మహిళ సంఘాలకు ఆదేశాలు అందడంతో పూర్తి వివరాలు సేకరించారు.
ఒక్కొక్క జతకు రూ.50..
విద్యార్థులకు ప్రతియేటా రేందు జతల యూనిపామ్ లను అందిస్తున్నారు. ఒక్కొక్క జతకు రూ.50 చొప్పున, రెండు జతలకు రూ.100 చొప్పున మహిళ సంఘానికి అందిస్తారు.ప్రభుత్వం అందించే కుట్టుకూలి చార్జీలు సరిపోవని గ్రామ ఐక్య సంఘాలు పేర్కొంటున్నాయి. దీంతో కొంతమంది ఆసక్తి చూపడం లేదు. గతేడాది వరకు పాఠశాల విద్యార్థులకు యూనిపామ్ లను అందించే బాధ్యతను హెచ్ఎం లకు అప్పజేప్పేవారు పాఠశాల విదులతో పాటు ఈ భారం కావడంతో యూనిపామ్ ల బాధ్యతను గ్రామ ఐక్య సంఘాలకు అప్పగించారు. గతేడాది స్టిచింగ్ చార్జీలు గిట్టుబాటు కాకపోవడంతో  సకాలంలో స్టిచింగ్ చేయకపోవడంతో యూనిపామ్ లు అందించడంలో ఆలస్యమైంది. ఈ విద్య సంవత్సరం ఎలాంటి అవరోధాలు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
Spread the love