నవ్వుల్‌ పువ్వుల్‌

అదెట్లా?
భార్య: ఏవండోరు జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసా?
భర్త: ఏం చెప్పారేంటి?
భార్య: మీరు దీర్ఘాయుష్షులట, తర్వాత స్వర్గానికి వెళ్తారట, మీ వెంట నేనూ వుంటానట.
భర్త: నువ్వు నా పక్కనుంటే ఇక అది స్వర్గమెట్లా అవుతుంది?

నా జేబులోనే
సుందర్‌ : రాత్రి తాగి లేటుగా వెళ్లినందుకు నా భార్య తలుపు తీయలేదు రా.. రోడ్డుపైనే పడుకున్నాను..!
వినోద్‌: మరి తెల్లారిన తర్వాత నీ భార్య తలుపు తీసిందా?
సుందర్‌ : లేదురా… తాగింది దిగిన తర్వాతే తెలిసింది… నాకసలు పెళ్లి కాలేదని, తాళం నా జేబులోనే వుందని.

మైసూర్‌ పాక్‌
భర్త : ఏమోరు.. ఈ సబ్బులో నెయ్యి వాసన వస్తుందేంటి?
భార్య : అయ్యో.. అది సబ్బు కాదండీ.. నేను చేసిన మైసూర్‌ పాక్‌.

డిజైన్‌ నచ్చలే

రాజు: రోడ్డు మీద నెక్లస్‌ దొరికితే నా భార్య అలాగే వదిలేసి వచ్చిందిరా.
రంగడు : ఎందుకని..?
రాజు: డిజైన్‌ నచ్చలేదని వదిలేసి వచ్చిందిరా నా పెళ్ళాం.. ఏమనాలి దీన్ని..

Spread the love