గాయంతో పారిస్‌ ఒలింపిక్స్‌కు శ్రీశంకర్‌ దూరం

గాయంతో పారిస్‌ ఒలింపిక్స్‌కు శ్రీశంకర్‌ దూరంన్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత లాంగ్‌జంపర్‌ మురళీ శ్రీశంకర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తీవ్ర మోకాలి గాయం కారణంగా పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించాడు. ఒలింపిక్స్‌కు సిద్ధమౌతున్న శ్రీశంకర్‌ మంగళవారం శిక్షణలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. శస్త్రచికిత్స అవసరమని తేలింది. దీంతో తప్పనిపరిస్థితుల్లో ఒలింపిక్స్‌ నుంచి వైదొలుగుతున్నట్లు కన్నీళ్ల పర్యంతమై పేర్కొన్నాడు. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీశంకర్‌ 8.37మీ జంప్‌తో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఆ పోటీల్లో శ్రీశంకర్‌ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌కు లాంగ్‌జంప్‌ విభాగంలో భారత్‌ను అర్హత సాధించిన ఏకైక అథ్లెట్‌ శ్రీశంకర్‌ మాత్రమే. 25ఏళ్ల శ్రీశంకర్‌ 2022 బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌, 2022లో హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 7.69మీ. జంప్‌ చేసి 13వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.

Spread the love