శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం..

నవతెలంగాణ – అమరావతి: ఏపీ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం కోసం ఆమె ఫైల్‌ తెచ్చారు. సంతకం పెట్టేందుకు నిరాకరించిన మంత్రి.. ఆ దస్త్రాన్ని తిప్పి పంపారు. మరోవైపు.. రెండు రోజుల క్రితం శ్రీలక్ష్మిని సీఎం చంద్రబాబు తన షేషీ నుంచి బయటకు పంపారు. ఆమె నుంచి పుష్పగుచ్ఛం తీసుకోకుండా నిరాకరించారు. జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం.

Spread the love