స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు…

నవతెలంగాణ – హైదరాబాద్
దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ మొదలైంది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒడుదొడుకులకు ఒడుదొడుకులు గురయ్యాయి. ఉదయం 66,532. 98 పాయింట్ల మొదలైన సెన్సెక్స్‌ తర్వాత లాభాల్లో పయనించింది. ఇంట్రాడేలో గరిష్ఠంగా 66,658.12 పాయింట్లను తాకింది. మదుపురులు లాభాల స్వీకరణకు దిగడంతో చివరకు 68.33 పాయింట్ల నష్టతో 66,459.31 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 20.25 పాయింట్ల నష్టంతో 19,733.55 వద్ద ముగిసింది. నిఫ్టీలో కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్‌టీఐ అండ్‌ ట్రీ టాప్‌ గెయినర్స్‌గా నిలువగా.. నష్టపోయిన వాటిలో పవర్ గ్రిడ్ కార్ప్, హీరో మోటోకార్ప్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. అయితే, ఈడీ సోదాల నేపథ్యంలో హీరో మోటోకార్ప్‌ నష్టపోయింది. ఉదయం వరకు లాభాల్లో హీరో మోటోకార్ప్‌ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.

Spread the love