ముస్లీం మైనార్టీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో గల ముస్లిం మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఎస్కే. హసీనా 982, ఎండి. అమీనా బేగం 972, ఎస్కే.సానియా 964, ఎస్కే. అఫ్రోజ్ సమీనా 962 మార్కులు సాధించి జిల్లాలోని మైనార్టీ గురుకుల  జిల్లా టాపర్లుగా నిలిచారు. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను పి.చాందిని 962, బి.వర్ష 952, డి.నందిని 939 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సర ఫలితాలలో ఎంపీసీ విభాగంలో కే.ప్రసన్న 470 మార్కులకు గాను 454, పి స్వాతి 452, బి మేఘన 450 మార్కులు సాధించారు. బైపీసీ విభాగం లో 440 మార్కులకు గాను ఎల్.చేతన 431,ఎండి.అశ్వియా 413,సమరీన్ 407 మార్కులు సాధించి వారి సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 96% నమోదు అయింది. ఈ సెకండ్ ఇయర్ ఫలితాలలో 950 మార్కులకు పైగా 8 మంది,900 మార్కులకు పైగా 14 మంది సాధించారు.ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం – 96% నమోదు అయింది. ఈ సెకండ్ ఇయర్ ఫలితాలలో 950 మార్కులకు పైగా 8 మంది,900 మార్కులకు పైగా 14 మంది సాధించారు. ప్రథమ సంవత్సర ఉత్తీర్ణత శాతం 83% నమోదు అయింది. ప్రథమ సంవత్సర ఫలితాలలో 450 మార్కులు పైగా ముగ్గురు విద్యార్థులు, 400 మార్కులకు పైగా 11 మంది విద్యార్థులు సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన తల్లిదండ్రులను కళాశాల ప్రిన్సిపాల్ సంగీత,అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.
Spread the love