పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే పట్టం 

– బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ కే పట్టం కడతారని హుస్నాబాద్ బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాకాల శ్యాంసుందర్ గౌడ్ అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో బండి సంజయ్ చేసిన అభివృద్ధి శూన్యమని, వినోద్ కుమార్ ఎంపీగా కరీంనగర్ రైల్వే లైన్, మెడికల్ కాలేజ్, నేషనల్ హైవే ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వినోద్ కుమార్ గెలుపు ఖాయమని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి పనులే నేడు గ్రామాల్లో కనబడుతున్నాయని వివరించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టకుండా  కెసిఆర్ ను తిట్టడమే ముఖ్యమంత్రి పని అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైదన్నారు. గతంలో సమైక్యాంధ్రలో కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు ఉండేవని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో ఆత్మహత్యలు పంట పొలాల ఎండిపోతున్నాయన్నారు .కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాల్ రూ .500 బోనస్ , మహిళలకు నెలకు రూ ₹2500  అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ శంకర్ , రైతు సంఘం నాయకులు దేవస్థానం శ్రీనివాస్ రెడ్డి ,పాకాల శ్యామ్ సుందర్ గౌడ్, లక్ష్మణ్ ,సునీత ,లక్ష్మి గజవెల్లి రాములు కురుమేలి చంద్రయ్య పాల్గొన్నారు.
Spread the love