కాంగ్రెస్, బీఅర్ఎస్ తెచ్చిన ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా

– కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 

నవతెలంగాణ – సిద్దిపేట
కాంగ్రెస్, బీ అర్ ఎస్ తెచ్చిన ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి, ఎస్ సి, ఎస్టి , బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ తెస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలో జరిగిన విశాల జనసభ లో ఆయన మాట్లాడుతూ.. 10 సంవత్సరాల పాలనలో దేశంలో మోడీ ఎన్నో సమస్యలను పరిష్కరించారని అన్నారు. రామ మందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు మోడీ చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని ఢిల్లీకి ఏటీఎంగా కాంగ్రెస్ పార్టీ మార్చిందన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని కాంగ్రెస్, బి ఆర్ ఎస్ లు మజ్లస్  కు భయపడి జరపడం లేదని, బీజేపీ పార్టీ మజిలీస్ కు భయపడుతున్నారు. కాలేశ్వరంలో,  భూములలో జరిగిన అవినీతికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, కాంగ్రెస్, బిఆర్ఎస్  రెండు పార్టీలు ఒకటేనని అన్నారు. మూడోసారి ప్రధానిగా మోడీ గెలిస్తే తెలంగాణలో అవినీతి అంతమవుతుందని అన్నారు. రఘునందన్ రావును గెలిపించుకుంటే ఢిల్లీలో మూడోసారి మోడీ ప్రధానమంత్రి అవుతాడని, రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Spread the love