విద్యార్థులు సమాజ హితం కోసం చదవాలి

విద్యార్థులు సమాజ హితం కోసం చదవాలి– ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
– నల్లకుంట నానో కాలేజీలో ఈఏపీసీఈటీ మోడల్‌ పేపర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ – ముషీరాబాద్‌
విద్యార్థులు సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేయాలని, ప్యాకేజీల కోసం కాకుండా సమాజ హితం కోసం చదవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నల్లకుంటలోని నానో కాలేజీలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం EAPCET & NEET ప్రశ్న పత్రాల మోడల్‌ పేపర్‌ను ఆవిష్కరించారు. నానో కాలేజ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ హాజరై EAPCET & NEET మోడల్‌ పేపర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. చుక్కారామయ్య సారథ్యంలో 20 సంవత్సరాలుగా ఎస్‌ఎఫ్‌ఐ ఎంసెట్‌ మోడల్‌ పేపర్‌, నీట్‌ వచ్చినప్పటి నుంచి ఆ మోడల్‌ పరీక్ష పేపర్‌ను కూడా పెడుతోం దని తెలిపారు. విద్యార్థుల్లో భయం పోగొట్టడానికి, అనుభవం రావడానికి ఈ మోడల్‌ పరీక్షలు నిర్వహించడం మంచి కార్యక్రమం అని అభినందించారు. ప్రతి విద్యార్థీ మంచి ర్యాంకు రావాలని, ఉన్నత కళాశాలలో సీటు సంపా దించాలని పోటీపడి పరిగెత్తుతారని తెలిపారు. ఎక్కడ సీటు వచ్చిందన్నది ముఖ్యం కాదని, మనం చదివే ప్రతి విషయంలోనూ సమాజంలో జరిగే మంచీ చెడులపై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి విషయాన్నీ విశ్లేషించడం.. దాన్ని అర్థం చేసుకోవడంతో కొత్త విషయా లను నేర్చుకోవచ్చన్నారు. బట్టీ చదువులు మానుకోవాలని చెప్పారు. ఉత్పత్తులు, వాటి వాడకం, సమాజంలో వాటికున్న లింకులపై ప్రత్యేకంగా చదవాలని, అవి తెలుసుకున్నప్పుడు దేనినైనా సాధించగలరని సూచించారు. కన్న కలలను సాకారం చేసుకోవడానికి శ్రద్ధ పెట్టాలన్నారు. డబ్బుల కోసం కాకుండా సమాజ హితం, అభివృద్ధి కోసం పని చేసినప్పుడే విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారని తెలి పారు.నానో కాలేజ్‌ చైర్మెన్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఎఫ్‌ఐ పోరా టాల్లోనే కాదు విద్యార్థులను చైతన్యవంతులను చేయడంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాం క్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యద ర్శులు ఆర్‌ ఎల్‌ మూర్తి, నాగరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర్ల కిరణ్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లెనిన్‌ గువేరా, అశోక్‌ రెడ్డి, నాయకులు విగేష్‌, ప్రశాంత్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love