సుముఖ హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌: నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన సుముఖ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు లాంచనంగా ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో ఇఎన్‌టితో పాటు దంత సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడంతో పాటు సర్జరీలు కూడా నిర్వహిస్తామని ఆసుపత్రి నిర్వహకులు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అనిల్‌ కుర్మాచలం, బిసి కమిషన్‌ చైర్మన్‌ వకులాభరణం కృష్ణమోహన్‌ రావు, స్థానిక కార్పోరేటర్‌ వనం సంగీత శ్రీనివాస్‌ యాదవ్‌, హౌస్‌ ఫెడ్‌ చైర్మన్‌ కడారి నవనీత రావు, ప్రముఖ వైద్యులు మా ఇఎన్‌టి డైరెక్టర్‌ డాక్టర్‌ మేఘనాథ్‌, ఫేషియల్‌ సర్జన్‌ దినేష్‌ శర్మ, ఫేషియల్‌ సర్జన్‌ జీవి రెడ్డి పాల్గొన్నారు. ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్‌ తిరునహరి సుధాంశ్‌ తదితరులు హాజరయ్యారు.

Spread the love