రెండు నెలలుగా నిలిచిన రెవెన్యూ స్టాంపుల సరఫరా

– ప్రయివేటుగా రూ.10కు విక్రయం
నవతెలంగాణ-ఇల్లందు
పోస్టాపీసుల్లో రెండు నెలలుగా రెవెన్యూ స్టాంపుల సరఫరా నిలిచిపోయింది. నియోజకవర్గంలో రెవెన్యూ స్టాంపుల ధరలకు రెక్క లొచ్చాయి. పోస్టాఫీసులకు వెలితే పోస్టు మాస్టర్లు రెవెన్యూ స్టాంపులు లేవంటున్నారు. రెవన్యూ స్టాంపులు స్టాక్‌ ఉన్న సమయంలో కిరాణ, పాన్‌, పుస్తకాల షాపులవారికి షీట్లకు షీట్లు సిబ్బంది విక్రయాలు జరుపుంటారని ప్రజలంటు న్నారు. అన్ని దాచుకుని కొరత ఏర్పడిన సమయంలో ఇస్టారీతిని అమ్ముకుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యేడాదిలో రెండు మూడు విడతలుగా ఇలా స్టాంపుల సరఫరా నిలిచిపోతున్నట్టు వినియోగదా రులంటున్నారు. స్టాంపులు లభించంచ కపోవడంతో ప్రజలు ఇబ్బందులుడు తున్నారు. దీన్ని ఆసరా చేసుకుని దుకాణాల్లో వాటి ధరలను విపరీతంగా పెంచి అమ్ముతున్నారు. కిరాణ, పాన్‌, పుస్తకాల షాపుల్లో రెవెన్యూ స్టాంపులు దొరుకుతున్నాయి. పోస్టాపీసుల్లో స్టాంప్‌ ఒకటి ఒక రూపాయ ఉండగా షాపుల్లో రూ.10 అమ్ముతున్నారని వినియోగ దారులు ఆరోపిస్తున్నారు. గతంలో వారే రూ.2 అమ్మేవారు. ఒక రూపాయి ఉన్న స్టాంప్‌ పది రూపాయలకు గింత ధరకు అమ్ముతారా అని లక్ష్మి అనే మహిళ ప్రశ్నించగా మాదగ్గర స్టాంపులు లేవంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరాన్ని ఆసరగా చేసుకుని దోపిడి చేయడం దారుణ మంటున్నారు. బ్యాంకుల్లో ప్రాంసరీ నోటుకు, ప్రభుత్వ ప్రయివేటు కార్యాల యాల్లో ఉద్యోగులు వేతనాలు తీసుకో వడానికి, బ్యాంకులు, పోస్టాపీసులు, చిట్‌ఫండ్‌ సంస్థల్లో డిపాజిట్‌ చేసిన సొమ్ము తిరిగి తీసుకోవడానికి వినియోగ దారులకు రెవెన్యూ స్టాంప్‌లు అవసర మవుతాయి. స్టాంప్‌ల కొరత ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఇల్లందు బ్రాంచి పోస్టాఫీ మాస్టర్‌ వీరన్నను నవతెలంగాణ వివరణ కోరగా స్పందించారు. రెండు నెలల నుండే స్టాంపుల సప్లైని లిచిపోయిందని తెలిపారు. కొత్తగూడెం హెడ్‌ పోస్టాఫీసునుండి స్టాంపులు రావాల్సి ఉందని అక్కడ కూడా సరఫరా లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పదించి పోస్టాఫీసుల్లో రెవెన్యూ స్టాంపులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Spread the love