నవతెలంగాణ – అస్సాం
అస్సాంలో ఇటీవల మహిళా పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్ముణి రాభా రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓ ఆడియో క్లిప్‌తోపాటు మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం కలకలం రేపుతోంది. నగావ్: అస్సాంలో ఇటీవల మహిళా పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్ముణి రాభా రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓ ఆడియో క్లిప్‌తోపాటు మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం కలకలం రేపుతోంది. రాభాను పోలీసు శాఖలోని కొందరు అధికారులు చిత్రహింసలు పెట్టి చంపారంటూ ఓ కానిస్టేబుల్ ఆ ఆడియో క్లిప్‌ను విడుదల చేసినట్లు సమాచారం. రాభా అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఆ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాద సమయంలో రాభా వాహనం ట్రక్కును ఢీకొనలేదని, ఆ సమయంలో ఆమె కారు నిలిపే ఉందని, ట్రక్కు వచ్చి దాన్ని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకొంటున్న ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు. ట్రక్కు ఢీకొట్టడానికి ముందు కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగిపోయారని అతడు పేర్కొన్నాడు.