తెలంగాణ జెన్‌కో ఏఈ, కెమిస్ట్‌ ఉద్యోగ పరీక్ష వాయిదా

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (జెన్‌కో)లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ), కెమిస్ట్‌ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలను జెన్‌కో వాయిదా వేసింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత పరీక్షల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ప్రకటన జారీచేసిన విషయం తెలిసిందే.

Spread the love