క్షయ రహిత నిజామాబాద్ జిల్లనే మన లక్ష్యం

నవతెలంగాణ – కంటేశ్వర్
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా  క్షయ నియంత్రణ విభాగం ద్వారా జిల్లాలో ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవ కార్యక్రమాల్ని స్థానిక నిజామాబాద్ పట్టణంలోని న్యూ అంబేద్కర్ భవన్లో గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా  ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవిన్యూ కిరణ్ కుమార్ ముఖ్య అతిది గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. టిబి సిబ్బంది చేసిన సేవలకు గాను నిజామాబాద్ జిల్లాకి జాతీయ స్థాయిలో  అవార్డులు రావడం జరిగింది అని ఇంకా భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చాలని దానికోసం మీరంతా నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా  కోరారు. డిఎంహెచ్ఓ  సుదర్శనం మాట్లాడుతూ జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా  నిరంతరం పనిచేయడం జరుగుతున్నదని ,ఈ సందర్భంగా భవిష్యత్తులో నిజాంబాద్ జిల్లాలో100% నూతన కేసులు నమోదు కాకుండా క్షయ రహిత జిల్లాగా నిజామాబాద్ ని మారుస్తామని  తెలిపారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ టీబీ వ్యాధి యొక్క లక్షణాలు వ్యాధి వ్యాప్తి చికిత్స మరియు నియంత్రణ చర్యల గురించి తెలిపారు.జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డివిజన్ల నిజామాబాద్, ఆర్మూర్ ,బోధన్ డివిజన్ ల వారిగా వైద్యాధికారులు మరియు టీబి నోడల్ పర్సన్, ఆశాలను  అతిధుల చేతుల మీదుగా మేమెంటోమరియు ప్రశంసాపత్రంతో సత్కరించడం జరిగింది. ఇంకా గత మూడు సంవత్సరాల నుండి 2021లో కాంస్య పథకం, 2022లో  వెండి పతకం, మరియు 2023లో బంగారు పతకం నిజామా బాద్ జిల్లాకు జాతీయస్థాయిలో రావడం ద్వారా హ్యాట్రిక్ సాధించడంతో ఆర్ఎన్టిసిపి విభాగం సిబ్బంది ముఖ్యంగా జిల్లా టిబి కోఆర్డినేటర్, డీపీపీఎం,ఎస్ టి ఎస్, ఎస్ టి ఎల్ ఎస్, ఫార్మసిస్టులు, రేడియో గ్రాఫర్,ల్యాబ్ టెక్నీషియన్లు, మరియు సిబ్బందిని అందరిని కూడా  ప్రశంసా పత్రాలతో సన్మానించడం జరిగింది. మరి అదేవిధంగా జిల్లాలో గతంలో టీబీ వ్యాధికి గురై టీబీ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి టిబి రహిత వ్యక్తిగా మారినటువంటి టీబి చాంపియన్స్ గా మారిన వారిని ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్,డాక్టర్ విద్య, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ డి ఎల్ ఎన్ స్వామి , పి ఓ డి టి డాక్టర్ నాగరాజ్  ,డి ఐ ఓ డాక్టర్ అశోక్ , ప్రైవేటు పల్మనాలజిస్టు డాక్టర్ రాజేశ్వర్ గారు.ఉదయ్ కృష్ణ, ఆశా కార్యకర్తలు  వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొన్నారు.
Spread the love