దొంగతనానికి ప్రయత్నించిన నిందితుడు అరెస్టు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని మూడో పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి ఆటోను ప్రయత్నించిన నిందితుడు బాలాజీ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ శనివారం తెలిపారు. మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్ నగర్, నిజామాబాద్ కు చెందిన షేక్ షఫీ తన ఇంటి ముందు పార్క్ చేసిన తన ఆటో ను తేదీ 26.05.2023 నాడు ఉదయం 5 గంటల సమయంలో ఒక దొంగ తన ఆటో ను స్టార్ట్ చేసి దొంగలించడానికి ప్రయత్నించగా షేక్ షఫీ అతనిని పట్టుకొని పోలీసు లకు అప్పగించాడు. షఫీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆటో దొంగతనానికి ప్రయత్నించిన కెనాల్ కట్టకు చెందిన దుల్గందే బాలాజీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మూడో పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.

Spread the love