Saturday, September 5, 2026
E-PAPER
Homeజాతీయంశరీరం యంత్రం కాదు

శరీరం యంత్రం కాదు

- Advertisement -

ఎప్పుడూ ‘వేగంగా’ పని చేయొద్దు
సమయాన్ని బట్టి విశ్రాంతి కూడా అవసరమే
సీజన్, నిద్ర ప్రభావంతో మనిషి శక్తి, పనితీరుపై ప్రభావం

“ఎప్పుడూ బిజీగా ఉండాలి.. ఎప్పుడూ ఫుల్ స్పీడ్‌లో పని చేయాలి.. ఒక్కరోజు కూడా పనితీరు తగ్గకూడదు” అనే ఒత్తిడి ఆధునిక జీవితంలో పెరిగిపోయింది. కానీ మన శరీరం ఒక యంత్రం కాదు. రుతువులు, నిద్ర, వాతావరణం, పని ఒత్తిడి వంటి అనేక అంశాలు మన శక్తి, మానసిక స్థితి, పనితీరును ప్రభావితం చేస్తాయి. అందుకే కొన్ని రోజులు నెమ్మదిగా సాగడం వైఫల్యం

న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో మీరు ఎలా ఉంటారో.. జూన్‌లో కూడా అలాగే ఉంటారా? అంటే చాలామందికి సమాధానం ‘కాదు’ అనే వినిపిస్తుంది. శీతాకాలంలో ఒకలా, వసంత కాలంలో ఇంకోలా, వేసవిలో మరోవిధంగా మన శరీరం ఉంటుంది. దానిని బట్టి మనం చేసే పని కూడా ఉంటుంది. ఒకసారి వేగంగా పని చేయొ చ్చు.. మరోసారి నెమ్మదించొచ్చు. అంటే దీనర్థం మనం బలహీనపడటమని కాదు.. శరీరం తన సహజ స్వభావానికి అనుగుణంగా మారుతోంది.

ఒకే సామర్థ్యంతో పని చేయాలనుకోవద్దు
మన శరీరం రోజూ ఒకే వేగంతో పని చేయదు. నిద్ర-మెలకువలను నియంత్రించే సర్కేడియన్ రిథమ్ మన రోజువారీ జీవితంపై కీలక ప్రభావం చూపుతుంది. కొందరు ఉదయం వేళల్లోనే అత్యంత చురుగ్గా ఉంటారు. మరికొం దరు రాత్రి వేళల్లో ఎక్కువ ఏకాగ్రతతో పనిచేస్తారు. ఈ సహజ సమయ ప్రాధాన్యతనే క్రోనోటైప్ అంటారు. హార్మోన్లు, న్యూరోట్రాన్స్‌ మీటర్లు వంటి శారీరక వ్యవస్థలు కూడా మన శక్తి, మూడ్, పనితీరును ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ మన సామర్థ్యం ఒకే స్థాయిలో ఉంటుందని ఆశించడం సరికాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
మనిషి రోబోట్ కాదు!
మనిషి ప్రతిరోజూ ఒకే వేగంతో పనిచేసే యంత్రం కాదు. కొన్ని రోజులు ఉత్సాహంగా ఉండటం.. మరికొన్ని రోజులు నెమ్మదించడం జీవితంలో సహజమైన భాగం. అందుకే ‘ఎప్పుడూ బిజీగా ఉండాలి’ అనే ఒత్తిడిని తగ్గించుకోవాలని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వేగంగా పని చేయాలని అనుకోవడం కంటే మన శరీరం మనకు ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? ఒక పని చేయడానికి ఇంత టెన్షన్ తీసుకోవాలా? తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి? అనే విషయాల గురించి కూడా ఆలోచించాలని అంటున్నారు.
ఎప్పుడు వేగంగా ముందుకు సాగాలి.. ఎప్పుడు వేగం తగ్గించాలి.. ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అన్నది తెలుసుకోవడమే నిజమైన మానసిక బలమని చెప్తున్నారు. ప్రకృతితో పోటీ పడుతూ జీవించడం కంటే.. మన శరీర చెప్పినట్టుగా జీవించడం ఆరోగ్యకరమైన మార్గమని నిపుణులు చెప్తున్నారు.ాదు.. శరీరం కోరుతున్న విశ్రాంతికి సంకేతం కావచ్చని నిపుణులు చెప్తున్నారు.
“ఎప్పుడూ బిజీగా ఉండాలి.. ఎప్పుడూ ఫుల్ స్పీడ్‌లో పని చేయాలి.. ఒక్కరోజు కూడా పనితీరు తగ్గకూడదు” అనే ఒత్తిడి ఆధునిక జీవితంలో పెరిగిపోయింది. కానీ మన శరీరం ఒక యంత్రం కాదు. రుతువులు, నిద్ర, వాతావరణం, పని ఒత్తిడి వంటి అనేక అంశాలు మన శక్తి, మానసిక స్థితి, పనితీరును ప్రభావితం చేస్తాయి. అందుకే కొన్ని రోజులు నెమ్మదిగా సాగడం వైఫల్యం క
న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో మీరు ఎలా ఉంటారో.. జూన్‌లో కూడా అలాగే ఉంటారా? అంటే చాలామందికి సమాధానం ‘కాదు’ అనే వినిపిస్తుంది. శీతాకాలంలో ఒకలా, వసంత కాలంలో ఇంకోలా, వేసవిలో మరోవిధంగా మన శరీరం ఉంటుంది. దానిని బట్టి మనం చేసే పని కూడా ఉంటుంది. ఒకసారి వేగంగా పని చేయొ చ్చు.. మరోసారి నెమ్మదించొచ్చు. అంటే దీనర్థం మనం బలహీనపడటమని కాదు.. శరీరం తన సహజ స్వభావానికి అనుగుణంగా మారుతోంది.

ఒకే సామర్థ్యంతో పని చేయాలనుకోవద్దు
మన శరీరం రోజూ ఒకే వేగంతో పని చేయదు. నిద్ర-మెలకువలను నియంత్రించే సర్కేడియన్ రిథమ్ మన రోజువారీ జీవితంపై కీలక ప్రభావం చూపుతుంది. కొందరు ఉదయం వేళల్లోనే అత్యంత చురుగ్గా ఉంటారు. మరికొం దరు రాత్రి వేళల్లో ఎక్కువ ఏకాగ్రతతో పనిచేస్తారు. ఈ సహజ సమయ ప్రాధాన్యతనే క్రోనోటైప్ అంటారు. హార్మోన్లు, న్యూరోట్రాన్స్‌ మీటర్లు వంటి శారీరక వ్యవస్థలు కూడా మన శక్తి, మూడ్, పనితీరును ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ మన సామర్థ్యం ఒకే స్థాయిలో ఉంటుందని ఆశించడం సరికాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
మనిషి రోబోట్ కాదు!
మనిషి ప్రతిరోజూ ఒకే వేగంతో పనిచేసే యంత్రం కాదు. కొన్ని రోజులు ఉత్సాహంగా ఉండటం.. మరికొన్ని రోజులు నెమ్మదించడం జీవితంలో సహజమైన భాగం. అందుకే ‘ఎప్పుడూ బిజీగా ఉండాలి’ అనే ఒత్తిడిని తగ్గించుకోవాలని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వేగంగా పని చేయాలని అనుకోవడం కంటే మన శరీరం మనకు ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? ఒక పని చేయడానికి ఇంత టెన్షన్ తీసుకోవాలా? తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి? అనే విషయాల గురించి కూడా ఆలోచించాలని అంటున్నారు.
ఎప్పుడు వేగంగా ముందుకు సాగాలి.. ఎప్పుడు వేగం తగ్గించాలి.. ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అన్నది తెలుసుకోవడమే నిజమైన మానసిక బలమని చెప్తున్నారు. ప్రకృతితో పోటీ పడుతూ జీవించడం కంటే.. మన శరీర చెప్పినట్టుగా జీవించడం ఆరోగ్యకరమైన మార్గమని నిపుణులు చెప్తున్నారు.ాదు.. శరీరం కోరుతున్న విశ్రాంతికి సంకేతం కావచ్చని నిపుణులు చెప్తున్నారు.

ప్రపంచ ఉద్యోగ విధానంలో కొత్త సవాలు
కోవిడ్ తర్వాత హైబ్రిడ్, రిమోట్ వర్కింగ్ పెరగడంతో వివిధ దేశాల్లో ఉన్న ఉద్యోగులు ఒకే టీంగా పనిచేస్తున్నారు. కానీ అందరూ ఒకే సీజన్ (రుతువు)లో ఉండరు. ఒక దేశంలో తీవ్రమైన వేసవి ఉండగా.. మరో దేశంలో శీతాకాలం ఉండొచ్చు. ఒక ప్రాంతంలోని ఉద్యోగి ఎండ కారణంగా అలసిపోతుండగా.. మరో ప్రాంతంలోని ఉద్యోగి చలి కారణంగా తక్కువ శక్తితో పనిచేస్తుండవచ్చు. అయినప్పటికీ ఇద్దరికీ ఒకే డెడ్‌లైన్ ఉండవచ్చు. అందుకే సంస్థలు ఉద్యోగులపై పని భారం మాత్రమే కాకుండా.. వారి శారీరక, మానసిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు.

మానసిక భద్రతకే ప్రాధాన్యం
పని భారం, మానసిక ఒత్తిడి, ప్రొడక్టివిటీలో మార్పుల గురించి ఉద్యోగులు తమ మేనేజ్‌మెంట్‌తో స్వేచ్ఛగా మాట్లాడగలగాలి. 2024లో 16 దేశాల్లో దాదాపు 28 వేల మంది ఉద్యోగులపై నిర్వహించిన సర్వే ప్రకారం.. మానసిక భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే సంస్థల్లో ఉద్యోగులు ఎక్కువ సంతృప్తిగా ఉండటంతో పాటు ఉద్యోగాలు వదిలే అవకాశం కూడా తక్కువగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -